గత రెండేండ్ల వరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన సమంత ఇటీవల పంథా మార్చి కథా బలమైన, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా ప్రస్తుతం సమంత ఓ బేబి అనే మహిళా ప్రధాన చిత్రంలో నటిస్తుంది.
సమంత అందమైన కథానాయిక. తెరపై క్యూట్ అందాలతో మంత్రముగ్ధల్నిచేస్తూ ప్రస్తుతం తెలుగు, తమిళంలో అగ్రకథానాయికగా రాణిస్తుంది. ముద్దుముద్దు మాటలతో మాయ చేయడం ఆమె ప్రత్యేకత. తాజాగా ఆమె దెయ్యంగా మారుతున్నారు. తమిళంలో హర్రర్ సినిమాలో నటించబోతుంది. దాస్ రామసామి దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దాస్ రామసామి గతంలో నయనతార ప్రధాన పాత్రధారిణిగా డోరా చిత్రాన్ని రూపొందించారు. తాజాగా సమంత కోసం ప్రత్యేకంగా ఓ హర్రర్ ప్రధాన కథని సిద్ధం చేశారట. ఇందులో ఆమె దెయ్యంగా కనిపించనున్నట్టు తెలుస్తుంది. మహిళా ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఇదిలా ఉంటే సమంత ఇప్పటికే రాజుగారి గది 2లో దెయ్యంగా నటించారు. నాగార్జున హీరోగా ఓంకార్ రూపొందించిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. ఇది అంతకుముందు వచ్చిన సూపర్ హిట్ బ్లాక్‌బస్టర్ రాజుగారి గదికి సీక్వెల్ అన్నవిషయం తెలిసిందే. దీంతోపాటు గతేడాది హర్రర్ సస్పెన్స్ థిల్లర్ యూటర్న్ లో మెయిన్ లీడ్ పాత్రలో నటించి మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకున్నప్పటికీ కమర్షియల్‌గా సత్తా చాటలేకపోయింది. ఈనేపథ్యంలో ప్రస్తుతం ఆమె మరో హర్రర్ సినిమా చేయబోతున్నారనే వార్త అటు ఆమె అభిమానులను, ఇటు సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి రెండు హర్రర్ సినిమాలు విజయాన్నివ్వలేకపోయాయి. ఈ తమిళ సినిమా అయినా సక్సెస్ ఇస్తుందో చూడాలి.
గత రెండేండ్ల వరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన సమంత ఇటీవల పంథా మార్చి కథా బలమైన, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా ప్రస్తుతం సమంత ఓ బేబి అనే మహిళా ప్రధాన చిత్రంలో నటిస్తుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో ఆమెతోపాటు నాగశౌర్య నటించారు. కొరియన్ సినిమా మిస్‌గ్రానికి రీమేక్‌గా రూపొందుతుంది. ఇది జులై 5న విడుదల కానుంది. దీంతోపాటు సమంత తెలుగులో తమిళ సూపర్ హిట్ 96 రీమేక్‌లో శర్వానంద్‌తో కలిసి నటిస్తుంది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. అలాగే నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా కీర్తిసురేష్ కీలక పాత్రలో నటిస్తున్న మన్మథుడు 2లో ముఖ్య పాత్ర పోషిస్తుంది.