చైతూ ఇంటిని కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసిన సమంత.. కారణం..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాగచైతన్య – సమంత బెస్ట్ క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. కానీ వీరిద్దరూ విడాకులు తీసుకొని ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగించారు. ఇక విడాకుల అనంతరం సమంతా పై పూర్తిస్థాయిలో నెగెటివిటీ స్ప్రెడ్ అయిందని చెప్పవచ్చు. ఇక సమంత నాగచైతన్యను మోసం చేసిందని.. విడాకుల తర్వాత భరణం కింద 250 కోట్ల రూపాయల భరణం తీసుకుందని.. అంతేకాదు కొన్ని విలువైన ఆస్తులను కూడా రాయించుకుందని ఈమెపై రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. కానీ వీటన్నింటిపై ఆమె ఎప్పుడూ కూడా క్లారిటీ ఇవ్వలేదు ..కానీ ఇటీవల బాలీవుడ్లో కాఫీ విత్ కరణ్ షో కి హాజరైన సమంత అన్ని విషయాలపై క్లారిటీ ఇవ్వడమే కాకుండా తను ఎలాంటి భరణం తీసుకోలేదని విడాకులు కూడా అంత సామరస్యంగా జరగలేదని ఆమె వెల్లడించింది.Chaitu and Samantha have different plans for their marriage

ఇదిలా ఉండగా నాగచైతన్యతో సమంత వివాహం జరిగిన తర్వాత కలిసి ఉన్న ఇంటిని..ఇప్పుడు మరీ అత్యంత ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ప్రముఖ సీనియర్ నటులు మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. ఇక మురళీమోహన్ మాట్లాడుతూ.. నాగచైతన్య – సమంత మా ఇల్లు కొనుగోలు చేశారు. ఇక అందులోనే చాలా సంతోషంగా కలిసి ఉండేవారు. ఇక ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఒక ఇండిపెండెంట్ ఇంటిని కొనుక్కున్నారు. అందుకని వారు నివసిస్తున్న ఇంటిని కూడా అమ్మేశారు. కానీ కొత్త ఇల్లు రీ మోడలింగ్ చేసే వరకు అక్కడే ఉంటామని అనడంతో మా ఇల్లు కొనుక్కున్న వారు కూడా అంగీకరించారు.

ఇంతలోనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇక ఆ తర్వాత మంచి ఇంటి కోసం సమంత బయట ఎక్కడెక్కడో చూసి వచ్చింది. కానీ ఆమెకు ఎక్కడా నచ్చలేదు. ఇక సేఫ్టీ కూడా ఇక్కడే బాగుందని అభిప్రాయపడిన సమంత మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఇల్లు కావాలని అడిగింది. కానీ మీకు మేము అమ్మాము. మీరు ఇంకొకరికి అమ్మారు కదా..! ఇప్పుడేం చేయగలనమ్మా? అని సమంతతో అన్నాను .కానీ అప్పుడు ఆమె ఆ ఇల్లు కొన్న వాళ్లతో మాట్లాడి వారికి ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ ఆ ఇంటిని తన సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం తన తల్లితో అక్కడే నివసిస్తోంది అంటూ మురళీమోహన్ చెప్పుకొచ్చారు. ఒకరకంగా చెప్పాలి అంటే నాగచైతన్యతో ఆ ఇంటిలో సమంత గడిపిన క్షణాలను మర్చిపోలేక పోతోంది అంటూ కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news