పాక్‌లో తొలి హిందూ మహిళా డీఎస్పీ మనీషా

-

పాకిస్థాన్‌లో హిందూ మైనారిటీ వర్గానికి చెందిన మనీషా రుపేతా అనే యువతి(26) ప్రత్యేకత చాటుకుంది. పాక్‌ పోలీస్‌ శాఖలో డీఎస్పీగా ఎంపికైన తొలి హిందూ మహిళగా నిలిచింది. సింధ్‌ ప్రావిన్సు జాకోబాబాద్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మనీషా.. ఈ ఘనత సాధించడంపై ఆనందం వ్యక్తం చేసింది.

‘అమ్మాయిలకు టీచర్‌ లేదా డాక్టర్‌ ఉద్యోగాలు మేలని, పురుషులు ఎక్కువగా ఉండే పోలీస్‌ శాఖలో ఇమడలేరని నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఆ ఆలోచనా విధానంలో మార్పు తేవాలని అనుకున్నాను. మహిళలపై వేధింపులు, నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సమాజంలో మహిళలు రక్షకులుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇదే నేను పోలీస్‌ ఉద్యోగాన్ని ఎంచుకునేలా చేసింది’. అని మనీషా పేర్కొంది.

సింధ్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌ ఎగ్జామ్‌లో ఆమె 468 మందిలో 16వ స్థానంలో నిలిచింది. పోలీస్‌ శాఖలో డీఎస్పీగా ఎంపికై ప్రస్తుతం శిక్షణ పొందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news