‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ డేట్ వచ్చేసింది….!!

-

మహేష్ బాబు మరియు రష్మిక మందన్నల కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇప్పటివరకు రెండు వరుస సక్సెస్ లు అందుకుని, కెరీర్ పరంగా తొలిసారిగా హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న మహేష్, ఈ సినిమా కోసం ఎంతో శ్రమ పడుతున్నట్లు తెలుస్తోంది. అపజయమెరుగని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాస్, కమర్షియల్ హాగులతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా పుష్కలంగా ఉండనున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ఇంట్రో టీజర్ తో పాటు పలు పోస్టర్స్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసాయి. ఇక సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో, ఇకపై సినిమా ప్రమోషన్స్ మాత్రం ఫాస్ట్ గా కొనసాగించాలని సరిలేరు యూనిట్ గట్టిగా దృష్టి పెట్టిందట. అందులో భాగంగా ఈ సినిమా టీజర్ ని ఈనెల 22వ తేదీన, దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టినరోజును పురస్కరించుకుని ఒకరోజు ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈమేరకు కాసేపటి క్రితం సినిమా యూనిట్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది.

 Sarileru neekevvaru teaser released November 22
Sarileru neekevvaru teaser released November 22

ఇకపోతే టీజర్ లో కామెడీ బిట్స్ తో పాటు రెండు యాక్షన్ సీన్స్ కూడా ఉండనున్నాయని, అలానే టీజర్ మొత్తం యాభై ఐదు సెకన్ల పాటు సాగనున్నట్లు టాక్ వినపడుతోంది. మరి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు, మొత్తానికి సరిలేరు టీజర్ రిలీజ్ డేట్ రివీల్ కావడంతో, వారు ఎంతో ఆనందంతో తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ రూపంలో తెలియచేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. కాగా అన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సినిమా 2020 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది….!!

Read more RELATED
Recommended to you

Latest news