చమ్మక్ చంద్ర తో వచ్చిన రూమర్స్ పై స్పందించిన సత్య శ్రీ..!!

-

బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటి. దాదాపుగా పది సంవత్సరాల నుండి నెంబర్ వన్ షో గా వెలుగుతూ ఉండేది. కానీ గడిచిన కొన్ని నెలల నుండి ఈ షో చాలా రేటింగ్ పరంగా డౌన్ అయిందని చెప్పవచ్చు. అందుకు ముఖ్య కారణం ఈ షో లో నుండి పలువురు కమెడియన్లు, జడ్జిలు బయటకు రావడం అని చెప్పవచ్చు. ఇక తరచూ ఈ మధ్యకాలంలో జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన ఆర్పి మల్లెమాల సంస్థపై శ్యాం ప్రసాద్ రెడ్డి పైన పలు వాక్యాలు చేయడం జరుగుతూ వస్తోంది. దీంతో పలువురు జబర్దస్త్ కమెడియన్లు సైతం ఆర్పి కి కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇందులోనే చమ్మక్ చంద్ర టీం లో సత్య శ్రీ అనే ఒక అమ్మాయి జబర్దస్త్ లో నటిస్తూ ఉండేది. దీంతో మంచి పాపులర్ అయిన ఈమె చమ్మక్ చంద్ర తో కలిసి ఉండటం వల్ల రూమర్లు రావడం జరిగింది. వాటిపై స్పందించింది ఈమె.. వాటి గురించి చూద్దాం.

చమ్మక్ చంద్ర కేవలం తనకు గురువు మాత్రమే అని తెలియజేసింది సత్య శ్రీ. తనని జబర్దస్త్ కి పరిచయం చేసింది కేవలం చంద్ర గారే అని తెలియజేసింది. అంతేకాకుండా తను కొన్ని సీరియల్స్ లో నటించిన కూడా తనకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ జబర్దస్త్ లోకి రాగానే మంచి పేరు వచ్చిందని తెలియజేసింది. ఇక అంతే కాకుండా తమ టీమ్ అంతా చమ్మక్ చంద్ర ఎక్కడ ఉంటే అక్కడే ఉంటామని తెలిపింది. ఇక దాంతో ఈమె కూడా జబర్దస్త్ నుండి బయటకు రావడం జరిగింది. దీంతో పలు రూమర్లు కూడా వచ్చాయి. అందుకు ముఖ్య కారణం మా గురువు గారితో కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవుతుందని తెలిపింది సత్య శ్రీ. ఇక ఇలాంటి రూమర్లు కేవలం సినిమా వాళ్లకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ అలాంటిది మేమెంత అని తెలియజేసింది. ఈ విషయంపై తమ తల్లిదండ్రులు కూడా ఆమెను ప్రశ్నించారట. కానీ తను జబర్దస్త్ మానేయమంటారని చాలా భయపడిందట. ఆ సమయంలో తన తండ్రి ఇలాంటివి ఏమీ పట్టించుకోకు.. ధైర్యంగా ముందుకు వెళ్ళు సత్య అని తెలియజేశారట. దాంతో చాలా ధైర్యంగా ఉన్నానని తెలిపింది సత్యశ్రీ.

Read more RELATED
Recommended to you

Latest news