దృశ్యం -2 డైరక్టర్ పెళ్ళి ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే..?

-

సాధారణంగా సినిమా డైరెక్టర్ పెళ్లి చేసుకోవడం అనేది పెద్ద విశేషమేమీ కాదు.. కానీ ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సెన్సేషన్ అని చెప్పవచ్చు. గతంలో కూడా చాలామంది డైరెక్టర్లు ఇలాగే తమ సినిమాల్లో వర్క్ చేసిన హీరోయిన్స్ తో ప్రేమలో పడి.. పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అదే లిస్టులోకి తాజాగా మరో దర్శకుడు కూడా చేరడానికి సిద్ధమవుతున్నాడు. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది ఈ జంట.. ఇంతకూ ఆ డైరెక్టర్ ఎవరు? ఆ హీరోయిన్ ఎవరు? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

కొన్ని రోజుల ముందు బాలీవుడ్ లో దృశ్యం 2తో సినిమాకు దర్శకత్వం వహించిన అభిషేక్ పాఠక్ ఈ సినిమాలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత హిందీలో వందల కోట్లు కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రాన్ని ఆయనే డైరెక్ట్ చేశాడు. ఇకపోతే ఈ డైరెక్టర్ గత ఏడాది సెప్టెంబర్ లో నటి శివలికా ఒబేరాయ్ కి టర్కీ లో ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ వీడియోని వీరిద్దరు కూడా తమ ఇన్ స్టా లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత నుంచి అడపాదడపా జంటగా కనిపిస్తున్న అభిషేక్ – శివలికా త్వరలో ఏడడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే అభిషేక్ డైరెక్టర్ మాత్రమే కాదు.. నిర్మాత కూడా.. ఈయన నిర్మాతగా వ్యవహరించిన ఖుదా హఫీజ్ సినిమాలో శివలికా నటించింది. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. గత ఏడాది ప్రపోజ్ చేసుకున్నారు. ఫిబ్రవరిలో గోవా బీచ్ టౌన్ లో రెండు రోజులపాటు జరగబోయే పెళ్లితో వీరు ఒకటి కాబోతున్నారు . ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news