ఫ్యాన్స్ కు కల్కి టీమ్ సర్ ప్రైజ్.. ప్రభాస్ ‘బుజ్జి’ తో సెల్ఫీ తీసుకునే ఛాన్స్

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 AD’. ఈ చిత్రం పేరు ప్రకటించినప్పటి నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో ఈ మూవీపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ టీమ్ వదులుతున్న ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. ముఖ్యంగా ఇటీవల ఈ చిత్రబృందం ప్రభాస్ బుజ్జిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ మైండ్ లో నుంచి బుజ్జి అసలు పోవడం లేదు. ఒక్కసారైనా బుజ్జిని దగ్గరగా చూడాలనుకునే వారు ఎంతో మంది ఉన్నారు.

అలాంటి వారికే కల్కి టీమ్ సూపర్ న్యూస్ చెప్పింది. ప్రభాస్ ‘బుజ్జి’ని ప్రేక్షకుల వద్దకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తోంది.  దేశంలో ఉన్న ప్రధాన నగరాల్లో మూవీ యూనిట్​తో పాటు ఈ కారును ప్రమోషన్స్​లో భాగంగా తిప్పుతారట. తమ నగరాలకు వచ్చినప్పుడు బుజ్జితో సెల్ఫీ తీసుకోవచ్చని ప్రేక్షకులు తెగ సంబరపడుతున్నారు. మామూలుగా హాలీవుడ్​లోనే మూవీలో ఉన్న ఒక వస్తువుతో ప్రమోషన్స్ చేయడం చూశామని, ఇప్పుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ వల్ల టాలీవుడ్​లో కూడా ఒక సరికొత్త ట్రెండ్ మొదలుకానుందని నెటిజన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news