మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో..!

-

సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో క్రేజీ మూవీ లైన్ లో ఉంది. 1 నేనొక్కడినే తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. రంగస్థలం హిట్ తో సుకుమార్ సత్తా ఏంటో తెలియగా ఈసారి మహేష్ తో అంతకుమించిన హిట్ సాధించాలని చూస్తున్నాడు సుకుమార్.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఓ 20 నిమిషాల పవర్ ఫుల్ రోల్ ఉందట. దీనికి సీనియర్ హీరోలు చేస్తే బెటర్ అని భావిస్తున్నాడట సుకుమార్. సీనియర్ స్టార్స్ లో ఎవరు ఈ పాత్రకు సూట్ అవుతారో డిస్కస్ చేస్తున్నారు. ఒకవేళ ఆ పాత్రలో వెంకటేష్ ఓకే అనుకుంటే ఆయన కూడా మహేష్ తో నటించేందుకు సై అనేస్తాడు.

వెంకీ కాకుండా మరెవరు అవుతారో చూడాలి. సినిమాలో సీనియర్ హీరోది చాలా ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తుంది. మరి ఈ పాత్రకు ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మహేష్ 25వ సినిమా మహర్షి 2019 ఏప్రిల్ 5 రిలీజ్ అంటున్నారు. సో సుకుమార్, మహేష్ సినిమా ఈసారైనా అంచనాలను అందుకుంటుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news