`అసురన్` తెలుగు రీమేక్ లో వెంటేశ్‌ హీరోయిన్ ఫిక్స్‌..

-

వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం అసురన్.. తమిళ్ లో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపుగా వంద కోట్ల వసూళ్లను ఈ సినిమా రాబట్టిన‌ట్టు తెలుస్తోంది. అలాంటి ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సురేశ్ బాబు దక్కించుకున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ కథానాయకుడిగా ఈ సినిమాను నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఈ సినిమాలో వెంకటేశ్ సరసన నాయికగా ‘శ్రియ’ను తీసుకోనున్నారని సమాచారం. ఇక మిగతా పాత్రలకిగాను దాదాపు కొత్త ఆర్టిస్టులనే తీసుకోనున్నారు. అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ పనులన్నింటినీ కూడా శ్రీకాంత్ అడ్డాల దగ్గరుండి చూసుకుంటున్నాడని చెబుతున్నారు. అన్నీ సెట్ కాగానే అప్పుడు ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news