ఫ‌ల‌క్‌నుమా దాస్‌కు సీక్వెల్‌.. ఎప్పుడో చెప్పిన విశ్వ‌క్‌సేన్‌

విశ్వ‌క్‌సేన్‌(Vishwak sen).. ఈయ‌న సొంతంగానే ఇండ‌స్ట్రీకి వ‌చ్చి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకానొక స‌మ‌యంలో అవ‌కాశాలు రాక‌పోతే సొంతంగానే సినిమా తీసుకుని తానేంటో నిరూపించుకున్నాడు. ఇక ఆయ‌న మాస్ హిట్ అందుకున్న ఫ‌ల‌క్‌నుమా దాస్ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమా వాస్త‌వానికి ‘అంగమలై డైరీస్’ అనే ఓ మలయాళ సినిమాకు రీమేక్ గా తెర‌కెక్కింది.

 

ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంద‌ని స‌క్సెస్ మీట్ లోనే విశ్వక్ సేన్ ప్ర‌క‌టించాడు. సీక్వెల్ తో మాత్రం భారీ క్యాస్టింగ్ తో దుమ్ములేపుతామ‌న్నాడు. ఇందుకోసం ప్రేక్ష‌కులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూడగా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ చేశాడు విశ్వ‌క్‌సేన్‌.

ఈ క్ర‌మంలో ఆ త్రోబాక్ సినిమాను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు విశ్వ‌క్‌. ఫలక్ నుమా దాస్ 2 సినిమా కోసం త‌మ మూవీ టీమ్ త్వరలోనే క‌లిసి ప‌నిచేయ‌బోతోందంటూ తెలిపాడు. ఈ సారి మాత్రం తన కథతో ఫలక్ నుమా దాస్ 2 సినిమాను తెర‌కెక్కిస్తున్నాడ‌ని స‌మాచారం. ప్రస్తుతం స‌పాగల్‌ సినిమాలో విశ్వ‌క్ న‌టిస్తున్నాడు. దీనిపై భారీగానే అంచ‌నాలు ఉన్నాయి.