కరోనా కేసులతో సతమతమవుతున్న నేపథ్యం లో మహారాష్ట్ర లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆ రాష్ట్రంలోని పూణెలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం లో దుర దృష్టవశాత్తు 15 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయం లో ఆ కెమికల్ ఫ్యాక్టరీ లో 37 మంది కార్మికులు ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ ఘటన సమాచారం తెలియగానే .. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటల నుంచి 20 మందిని కాపాడింది.
మరో ఇద్దరు కార్మికులు మంటల్లోనే చిక్కుకోవడం బాధకరమైన విషయం. ప్రస్తుతం మంటలు ఆర్పే పనిలో ఫైర్ సిబ్బంది ఉంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంతో సహా భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు ఇంకా తెలియ రాలేదు. ఎవరి తప్పిదం వల్లనైనా జరిగిందా ? లేక అనుకోకుండా జరిగిందా ? అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రమాదంపై విచారణలో పూర్తి వివరాలు బయటపడనున్నాయి.