సూర్య 24 సినిమాకు సీక్వెల్ రెడీ !

త‌మిళ స్టార్ హీరో సూర్య, విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 2016 లో 24 అనే సినిమా వ‌చ్చింది. టైమ్ ట్రావెల్ నేప‌థ్యంతో ఈ సినిమా క‌థను రూపొందించారు. అప్ప‌ట్లో ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు ఇత‌ర భాషాల‌లో సెన్షేష‌న్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో హీరో సూర్య ఏకంగా మూడు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించాడు. టైమ్ ట్రావెల్ క‌థ‌, ఓకే హీరో మూడు పాత్ర‌ల‌లో క‌నిపించ‌డంప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా అనిపించింది. అందుకే పెద్ద హిట్ ను అందుకుంది. అయితే ఈ సినిమా కు సీక్వెల్ కోసం డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ క‌థ‌ను సిద్ధం చేశాడ‌ని తెలుస్తుంది.

త్వ‌ర‌లోనే ఈ సినిమాను ప‌ట్టాల‌పైకి ఎక్కించే అవ‌కాశం కూడా ఉంద‌ని స‌మాచారం. అలాగే ఏడాది చివ‌రిక‌ల్లా.. ఈ సినిమాను థీయేట‌ర్స్ ల‌లో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తుంది. అయితే ఈ సీక్వెల్ పై ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక స‌మాచారం రాలేదు. కానీ త్వ‌ర‌లోనే దీనిపై అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. కాగ మొద‌టి సినిమాలో మూడు పాత్ర‌ల‌లో న‌టించిన సూర్య సీక్వెల్ లో ఎన్ని పాత్ర‌లు చేస్తాడో తెలియాల్సి ఉంది. అలాగే 24 లో హీరోయిన్లుగా నిత్య మీన‌న్, స‌మంత న‌టించారు. అయితే ఈ సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవ‌రు న‌టిస్తారో చూడాలి మ‌రి.