చలి చంపేస్తోంది… తెలంగాణలో రానున్న మూడు రోజుల పెరగనున్న చలి తీవ్రత

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలకు క్రమంగా తగ్గుతున్నాయి. దీనికి తోడు ఈదురు గాలుల తీవ్రత పెరగడంతో చలి తీవ్రత ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు తక్కవగా నమోదవుతున్నాయి. రానున్న 3 రోజులు చలి తీవ్ర పెరుగతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల సెంటిగ్రేట్ మాత్రమే నమోదవుతున్నాయి. పశ్చిమ, వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 

కొన్ని ప్రాంతాల్లో సోమవారం ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ లో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. హైదరాబాద్ కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలితో పాటు పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఆదిలాబాద్, కుమ్రం భీం, నిర్మల్ , మంచిర్యాల జిల్లాల్లో కూడా 10 డిగ్రీల ఉష్టోగ్రతలను నమోదవుతాయని… ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.