పెళ్లి పీటలెక్కనున్న మిల్కీ బ్యూటీ తమన్నా !

-

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరు మిల్కీ బ్యూటీ తమన్నా. అయితే… హీరోయిన్‌ తమన్నా.. ఓ వైపు స్పెషల్‌ సాంగ్స్‌, మరో వైపు పెద్ద సినిమాల్లో నటిస్తూ.. ఫుల్‌ జోష్‌ లో ఉంది. ఈ నేపథ్యంలోనే… తన పెళ్లి పై ఇటీవల కాలంలో వరుసగా వస్తున్న వార్తలపై హీరోయిన్‌ తమన్నా ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తాను సినిమాలతో తీరిక లేకుండా ఉన్నానని చెప్పిన హీరోయిన్‌ తమన్నా.. మరో రెండేళ్ల వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం తన కెరీర్‌.. ఎలాంటి బ్రేకులు లేకుండా చాలా సాఫిగా సాగుతుందని.. ఇలాంటి సమయంలో.. పెళ్లి చేసుకోవడం అస్సలు కరెక్ట్‌ కాదని తెలిపింది. కానీ సమయం వచ్చిన ప్పుడు.. అన్ని సవ్యంగా కొనసాగుతాయని మిల్కీ బ్యూటీ తమన్నా వెల్లడించింది. మెగాస్టార్‌ చిరంజీవి భోళా శంకర్‌ సినిమాతో పాటు రెండు కన్నడ సినిమాల్లోనూ నటిస్తుంది తమన్నా. దటీజ్‌ మహాలక్ష్మి, ఎఫ్‌ 3, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో తమన్నా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news