‘పఠాన్‌’ అసలు కలెక్షన్స్ ఎంతంటూ నెటిజన్ ప్రశ్న.. క్రేజీ రిప్లై ఇచ్చిన షారుక్

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారూక్ ఖాన్‌ తరచూ ట్విటర్ లో అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు ఫ్యాన్స్ అడిగే తిక్క ప్రశ్నలకు బాద్షా తనదైన రీతిలో రిప్లై ఇస్తూ చురకలంటిస్తుంటారు. తాజాగా ఓ నెటిజన్.. పఠాన్ మూవీ అసలు కలెక్షన్స్ ఎంతంటూ షారుక్ ని ఆరా తీశాడు.

దీనికి కింగ్ ఖాన్.. దిమ్మదిరిగిపోయే రిప్లై ఇచ్చాడు. బాద్ షా తనదైన శైలిలో.. ‘5 వేల కోట్ల మంది ప్రేమ. 3 వేల కోట్ల మంది ప్రశంసలు. 3,250 కోట్ల మంది కౌగిలింతలు… రెండు బిలియన్‌ల (సుమారు 16 వేల కోట్లు) మంది నవ్వులు, ఇంకా లెక్కింపు కొనసాగుతోం’ అని జవాబిచ్చారు. చివరలో ‘నీ అకౌంటెంట్‌ నీకు ఏం చెప్పాడు..??’ అంటూ చమత్కరించారు. ఈ రిప్లై కు షారుక్ అభిమానులు ఫిదా అవుతున్నారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ లో బాద్షాయే నంబర్ వన్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో, యశ్‌రాజ్‌ ఫిల్మ్‌ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న పఠాన్‌ సినిమా జనవరి 25న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ మూవీ తొలిరోజే రూ.100 కోట్ల కలెక్షన్‌లు రాబట్టింది. తొలి 8 రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్‌ల మొత్తం రూ.364 కోట్లను దాటింది.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?