కేవలం ఇంటి ముందు నేమ్ ప్లేట్ కి అన్ని లక్షలు ఖర్చుపెట్టిన షారుక్..!!

-

బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుక్ ఖాన్ కూడా ఒకరని చెప్పవచ్చు. షారుక్ ఖాన్ తెరకెక్కించే సినిమాలు కూడా భారీ బడ్జెట్ తోనే ఉండడమే కాకుండా భారీ కలెక్షన్లు సాధిస్తూ ఉంటాయి. బాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటులలో షారుక్ ఖాన్ కూడా ఒకరు. షారుక్ ఖాన్ కి ముంబైలో అత్యంత విలాసమైన ఒక ఇల్లు కూడా ఉన్నది. ఆ ఇంటికి భారీ ఖర్చుపెట్టి తనకు నచ్చినట్లుగా చాలా గ్రాండ్గా ఆ ఇంటిని నిర్మించుకున్నారు షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ ఇంటిపేరు మన్నత్ అని పేరు పెట్టుకున్నారు.

మన్నత్ కూడా ముంబైలో ఒక ఫేమస్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఎంతోమంది అభిమానులతో పాటు ముంబై చూడడానికి వచ్చిన వాళ్ళు షారుక్ ఖాన్ ఇంటిని కచ్చితంగా చూసి వెళ్తూ ఉంటారు. అయితే ఈ మన్నత్ కి మరింత గ్రాండ్ ఇయర్ తీసుకురావడానికి గతంలో వజ్రాలతో ఉన్న నేమ్ ప్లేట్ ని చేయించారు షారుక్ ఖాన్. ఆ నేమ్ ప్లేట్ పైన వజ్రాలతో మన్నత్ అని రాసి ఉంటుంది దీనిని షారుఖ్ ఖాన్ తన ఇంటి గేటు బయట అమర్చారు. ఈ నేమ్ ప్లేట్ కోసం వజ్రాలతో చేయించారా అని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు.

గతంలో సెక్యూరిటీ కారణాలవల్ల ఆ వజ్రాల నేమ్ ప్లేట్ ని తీసివేయడం జరిగింది. తాజాగా ఇప్పుడు మరొక సారి తన ఇంటికి వజ్రాల నేమ్ ప్లేట్ చేయించి ఉంచారు. దాదాపుగా దీని విలువ రూ.35 లక్షలకు పైగా వుంటుంది. వజ్రాల ముక్కలతో నేమ్ ప్లేట్ తయారు చేయించి దానిపైన మన్నత్ అని రాయించి ఇంటిముందు పెట్టారు షారుక్. రాత్రి సమయాలలో ఆ ఇంటికి మరింత అందాన్ని తీసుకువస్తుంది. ఇక ఈ నేమ్ ప్లేట్ చూడడానికి ఎంతోమంది ప్రజలు షారుక్ ఖాన్ ఇంటికి క్యూ కడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news