శివాజి, రోబో సినిమాల తర్వాత శంకర్ చేసిన మరో ప్రయత్నం 2.ఓ. రోబో సినిమాకు సీక్వల్ గా చిట్టి రోబో విన్యాసాలు చూపించేందుకు బాగానే కష్టపడ్డారు చిత్రయూనిట్. లైకా ప్రొడక్షన్స్ లో 600 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాలో రజినికి సరిసమానంగా అక్షయ్ కుమార్ పాత్ర ఉంది. పక్షి రాజుగా అక్షయ్ నటన ఆకట్టుకుంది. సినిమాలో అక్షయ్ కుమార్ తన విశ్వరూపం చూపించాడు.
అయితే పక్షి రాజు పాత్రకు శంకర్ 1987లో మరణించిన సలీం అలిని స్పూర్తిగా తీసుకున్నారట. సలీం అలి కూడా పక్షుల గురించి ఎంతో రీసెర్చ్ చేశారట. పక్షుల మీద ఎన్నో పుస్తకాలు కూడా ఆయన రాశారని తెలుస్తుంది. పక్షుల మీద ఆయన చూపించిన గొప్పదని తెలుస్తుంది. ఆయన స్పూర్తితోనే పక్షి రాజు పాత్ర రాసుకున్నాడని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తుంది.
పక్షి రాజుగా అక్షయ్ మనుషుల మీద పగపట్టడం ఆ తర్వాత చిట్టి రోబో పక్షి రాజుని అంతమొందించడమే 2.ఓ సినిమా కథ. పక్షి రాజు పాత్రకు ఆయన స్పూర్తి తప్ప ఈ కథకు సలీం ఆలికి ఎలాంటి సంబంధం లేదని తెలుస్తుంది.