షారుఖ్ ‘జీరో’ ట్రైలర్.. విమర్శకులకు సమాధానం

-

కొన్నాళ్లుగా కెరియర్ లో వెనుకపడ్డ షారుఖ్ ఖాన్ మరోసారి బాక్సాఫీస్ మీద తన స్టామినా ఏంటో చూపించడానికి వస్తున్నాడు. బాక్సాఫీస్ బాద్షా అయిన షారుఖ్ ఈరోజు పుట్టిన రోజు సందర్భంగా అతను నటిస్తున్న జీరో మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. సినిమాలో షార్ట్ మ్యాన్ గా నటిస్తున్న షారుఖ్ ట్రైలర్ తో సర్ ప్రైజ్ చేశాడు. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో షారుఖ్ సరసన అనుష్క శెట్టి నటించగా కత్రినా కైఫ్ కూడా నటిస్తుంది. షారుఖ్ ఖాన్ నిర్మాణంలో ఆయన సతీమణి గౌరి ఖాన్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ప్రాంసింగ్ గా అనిపిస్తుంది.

బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ ఓ సంచలనం. ఇప్పుడు యువ హీరోలు చేస్తున్న బాక్సాఫీస్ సందడి అంతా ఎప్పుడో తన సినిమాలతో వచ్చేలా చేశాడు షారుఖ్. కథల విషయంలో ఈమధ్య పొరపాట్లు చేయగా ఇక ఈ జీరో నుండి తన సత్తా చూపించేలా ఉన్నాడు. జీరో ట్రైలర్ చూస్తేనే సినిమా పక్కా హిట్ బొమ్మగా అనిపిస్తుంది. షారుఖ్, అనుష్కల నటన హైలెట్ గా ఉండగా స్టోరీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమా షారుఖ్ హిట్ సినిమా ఆకలి తీరుస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version