శర్వానంద్ ను దారుణంగా పడగొట్టిన వసూళ్లు..!

-

యువ హీరో శర్వానంద్ హను రాఘవపుడి డైరక్షన్ లో వచ్చిన సినిమా పడి పడి లేచే మనసు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజైంది. సినిమా టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచినా అసలు బొమ్మలో అలాంటి మ్యాజిక్ లేకపోవడంతో సినిమాను తిప్పికొట్టారు ప్రేక్షకులు. ప్రపంచవ్యాప్తంగా 22.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన పడి పడి లేచె మనసు సినిమా ఫుల్ రన్ లో 7.97 కోట్లను మాత్రమే కలెక్ట్ చేసింది.

లై సినిమా ఫ్లాప్ తర్వాత హను పడి పడి లేచె మనసుతో హిట్ కొడతాడని భావించారు కాని సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మహానుభావుడు హిట్ తర్వాత శర్వానంద్, ఎం.సి.ఏ తర్వాత సాయి పల్లవి ఇద్దరు హిట్ ఫాంలో ఉండగా ఆ ఇద్దరు కలిసి చేసిన ఈ సినిమా ఫెయిల్ అయ్యింది. 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన పడి పడి లేచే మనసు శర్వానంద్ కు దారుణంగా పడగొట్టిందని చెప్పొచ్చు.

ఏరియాల వారిగా పడి పడి లేచె మనసు ఫైనల్ కలక్షన్స్..

నైజామ్: 2.61 కోట్లు
సీడెడ్: 0.84 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.82 కోట్లు
ఈస్ట్ : 0.42 కోట్లు
వెస్ట్: 0.32 కోట్లు
కృష్ణ: 0.49 కోట్లు
గుంటూరు: 0.62 కోట్లు
నెల్లూరు: 0.31 కోట్లు

ఏపీ/తెలంగాణ: 6.43 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా: 0.48 కోట్లు

ఓవర్సీస్: 1.06 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్: 7.97 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news