పడి పడి లేచే మనసు టైటిల్ సాంగ్.. ప్రేమలో పడిపోవడం ఖాయం

-

హను రాఘవపుడి డైరక్షన్ లో శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా పడి పడి లేచే మనసు. ఈ సినిమా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. డిసెంబర్ 21న రిలీజ్ కానున్న ఈ సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజ్ చేశారు. టైటిల్ సాంగ్ గా వచ్చిన ఈ సినిమాలోని మొదటి పాట మెలోడీగా ఉంది.

శర్వానంద్, సాయి పల్లవిల కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న హను రాఘవపుడి లై నిరాశ పరచగా ఆ తర్వాత చేస్తున్న సినిమా పడి పడి లేచే మనసు. ఈమధ్యనే రిలీజైన టీజర్ కూడా ప్రేక్షకులను మెప్పించగా సినిమాతో శర్వానంద్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news