
విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన సినిమా 96. రిలీజ్ కు ముందే సినిమా చూసి రీమేక్ రైట్స్ కొనేసిన దిల్ రాజు కోలీవుడ్ లో ఆ సినిమా హిట్ కాగా ఇక్కడ రీమేక్ చేయాలన్న తపన పెంచుకున్నాడు. అల్లు అర్జున్, నాని, గోపిచంద్ ఇలా అందరి హీరోలకు ఆ సినిమా చూపించడం వారు కాదనడం జరిగింది. ఫైనల్ గా ఈ రీమేక్ కు కాస్టింగ్ ఓకే అయ్యిందని తెలుస్తుంది.

శర్వానంద్, సమంతలు జంటగా 96 తెలుగు రీమేక్ సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాకు ఇంకా దర్శకుడు కన్ ఫాం అవ్వలేదు. మాత్రుక డైరక్టర్ ప్రేం కుమార్ ను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు దిల్ రాజు. మొత్తానికి 96 రీమేక్ కు సర్వం సిద్ధమైంది. జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా 2019 దసరాకి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో వెళ్లడవుతాయి.