రాజమౌళి తెరకెక్కిస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలో చరణ్, ఎన్.టి.ఆర్ ఎవరికి వారు నువ్వా నేనా అనేలా ఉంటారట. అయితే చరణ్ పాత్ర కన్నా ఎన్.టి.ఆర్ రోల్ కోసం రాజమౌళి ఎక్కువ దృష్టి పెడుతున్నారట. ఎన్.టి.ఆర్ లుక్ విషయంలో కూడా ఇప్పటికే ఓ ఫైనల్ డెశిషన్ కు వచ్చారట.
ప్రస్తుతం వర్క్ అవుట్స్ చేస్తుండగా అనుకున్న రూపానికి వచ్చేలా ఎన్.టి.ఆర్ లాయిడ్ స్టీవెన్స్ సహాయంతో తారక్ ఫిట్ గా ఉండేలా ప్రయత్నిస్తున్నాడట. అంతేకాదు ఈమధ్య స్టార్ సినిమాలకు లీకుల గోల ఎక్కువైంది. అందుకే ట్రిపుల్ ఆర్ కు సంబందించి ఎలా లీకులు జరుగకుండా ముఖ్యంగా ఎన్.టి.ఆర్ లుక్ విషయంలో జక్కన్న భారీ స్కెచ్ వేశాడని తెలుస్తుంది.