SHEKAR Teaser : వాడెప్పుడైనా మ‌నం చెప్పింది చేశాడా.. అంటు వ‌చ్చిన శేఖ‌ర్ టీజ‌ర్

సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ ప్ర‌ధాన పాత్ర లో వస్తున్న సినిమా శేఖ‌ర్. ఈ సినిమా రాజ శేఖ‌ర్ కు 91 వ సినిమా గా తెర‌కెక్కుతుంది. ఈ సినిమా టీజ‌ర్ ను తాజా గా చిత్ర బృందం విడుద‌ల చేసింది. వాడెప్పుడైనా మనం చెప్పింది చేశాడా.. వాడే చేసేది మ‌న‌కు చెప్పాడా.. అంటు రాజ శేఖ‌ర్ ను ఉద్ధేశించి వ‌చ్చే డైలాగ్ తో టీజ‌ర్ ప్రారంభం అవుతుంది.

ఈ డైలాగ్ టీజ‌ర్ మొత్తానికి హైలైట్ గా ఉంది. అలాగే హీరో రాజ శేఖ‌ర్ లుక్ కూడా కొత్త గా ప‌వ‌ర్ ఫుల్ గా ఉంది. అయితే ఈ సినిమా కు జీవిత రాజ‌శేఖ‌ర్ స్క్రీన్ ప్లే తో పాటు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే నిర్మాతలు గా రాజ‌శేఖ‌ర్ కూతుళ్లు శివాని, శివాత్మిక తో పాటు సుధ‌కర్ రెడ్డి, వెంక‌ట శ్రీ‌నివాస్ ఉన్నారు. అలాగే సంగీత ద‌ర్శ‌కుడి గా అనుప్ రూబెన్స్ వ్య‌వ‌హిర‌స్తున్నారు. కాగ ఈ సినిమా ను వ‌చ్చే నెల 17 వ తేది విడుదల చేయాల‌ని శేఖ‌ర్ సినిమా బృందం ప్లాన్ చేస్తుంది.