స్టార్ హీరో తండ్రికి హార్ట్ ఎటాక్… మెరుగైన వైద్యం కోసం

కోలీవుడ్ స్టార్ హీరో శింబు తండ్రి టీ. రాజేందర్ కు గుండె పోటు వచ్చింది. ఆయన్ను వెంటనే హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. మా ఇద్దరు అభిమానులకు నమస్కారం.. నాన్నకు స్వల్పంగా ఛాతీ నొప్పి వచ్చిందని… వెంటనే ఆస్పత్రికి తరలించామని పరీక్షలు చేయగా పొత్తి కడుపులో రక్తస్రావం అవుతుందని వైద్యులు తెలిపారని, మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్తున్నట్లు హీరో శింబు మీడియాకు తెలియజేశాడు. 

ఆయన పూర్తిగా స్పృహలోనే ఉన్నారని.. మీ ప్రేమ, ఆప్యాయతలకు ధన్యవాదాాలని… త్వరలోనే చికిత్స ముగించుకుని మళ్లీ మమ్మల్నందరిని కలవడానికి వస్తారని శింబు ప్రకటించారు. ఇదిలా ఉంటే టీ. రాజేందర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ఈ వార్త ప్రస్తుతం కోలీవుడ్ లో సంచలనంగా మారింది. దీంతో రాజేందర్, శింబు అభిమానులు కలవరపడుతున్నారు. తమ అభిమాన నటుడికి ఎలాంటి అపాయం కలుగొద్దని ప్రార్థిస్తున్నారు. ఇక శింబు కూడా తెలుగు తెరకు కొత్తేం కాదు. చాలా ఏళ్ల తరువాత ఇటీవల వచ్చిన ‘ మానాడు’ సినిమాలో హిట్ కొట్టాడు శింబు.