హైదరాబాద్‌లో దారుణం.. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళనే బెడ్‌పై..

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలనే హతమార్చాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా, మనుబోలు మండలం, కట్టువపల్లి గ్రామానికి చెందిన పెంచలయ్య కుమారుడు గోని ప్రసాద్‌ (35) వంట మాస్టర్‌. ఆరు నెలల క్రితం ఎల్లమ్మబండ దత్తాత్రేనగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అతడి గదికి ఓ మహిళ వారానికి ఒకసారి వచ్చి పోతుండేది. ఏమైందో కానీ ప్రసాద్‌ బెడ్‌పైనే ఆమె తల పగలగొట్టి హత్య చేసి పరారయ్యాడు. నాలుగు రోజుల అనంతరం ఆ గదికి సమీపంలో ఉన్న కిరాణా దుకాణం యజమానికి ఓ ఫోన్‌ వచ్చింది.

Illegal affair: పోలీస్ స్టేషన్ లో బిడ్డతో డ్రామాలు, ట్విస్ట్, ప్రియుడితో  తల్లి జల్సా, భర్త ఏం చెప్పాడంటే ! | Illegal affair: Big twist to woman hand  over 9 month baby to Mysuru ...

ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి హత్య విషయం చెప్పాడు. కాలనీ అధ్యక్షుడు డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో జగద్గిరిగుట్ట సీఐ సైదులు గది తలుపులు పగలగొట్టారు. లోపల రక్తపు మడుగులో దుర్వాసన వస్తున్న మహిళ శవాన్ని గుర్తించారు. హత్యోదంతం వెలుగులోకి రావడంతో స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. నాలుగు రోజులుగా తమ ఇంటి పక్కనే శవం ఉందని తెలిసి స్థానిక మహిళలు ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.