“సైరా ప్రీమియం ధర” చూసి షాక్..

-

రామ్ చరణ్ నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకున్న  సైరా నరసింహ రెడ్డి సినిమా అక్టోబర్ 1 వతేదీ న అమెరికా వ్యాప్తంగా ప్రీమియర్ షో జరగనుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో అమెరికాలో తెలుగు ఎన్నారై లు ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. అయితే తెలుగు సినిమాలని అమెరికాలో పంపిణి చేసే వారు సదరు స్టార్ హీరోల సినిమాల టిక్కెట్ల విషయంలో దారుణమైన వైకరిని ప్రదర్శిస్తున్నారు.

బాహుబలి సినిమా టిక్కెట్టు విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ప్రస్తుతం సైరా విషయంలో కూడా అలాంటి ధరలే నడుస్తున్నాయని అంటున్నారు ఎన్నారైలు. ప్రస్తుతం సైరా ప్రీమియం టిక్కెట్టు ధర 29 డాలర్లు గా నిర్ణయించారు. అయితే రెండవ తేదీ న ఈ టిక్కెట్టు ధరని 17 డాలర్లు చేశారు. బహుబలికి ఎంతో కనెక్ట్ అయిన ప్రేక్షకులు 30 డాలర్లు కి అప్పట్లో కొనుగోలు చేశారు టిక్కెట్లు. ఇప్పుడు చిరు సినిమా కావడంతో 29 డాలర్లు గా చేసి బాహుబలికి పోటీగా అమెరికాలో బాహుబలి రికార్డ్ లు బద్దలు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు కొందరు ఎన్నారైలు.

అమెరికాలో నలుగురు ఉన్న ఒక కుటుంభం సినిమాని వీక్షించాలంటే 125 డాలర్లు అవుతుంది. అలాంటిది ప్రీమియర్ షో చూడాలంటే 200 డాలర్లు ఖర్చు అవుతుందని వాపోతున్నారు. అసలు రెండు మూడు గంటలకి ఇంత ఖర్చులు పెట్టాలా అనే ఎన్నారైలు కూడా లేకపోలేదు. ఎంత ఎన్నారైలు అయినా సరే ఇంతా టిక్కెట్ల రెట్లు పెంచితే ఎలా అంటూ విమర్సల మీద విమర్శలు చేస్తున్నారు. కోట్లు కొల్లగొట్టిన AVENGERS End Game సినిమా టిక్కెట్టు ధర కేవలం 9 డాలర్లు పలికిందనే విషయం గుర్తు చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news