పవిత్ర లోకేష్ పారితోషకం ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!

-

ప్రముఖ నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఒకప్పుడు సినిమాలకే పరిమితమైన ఈమె ఇప్పుడు 50 సంవత్సరాల వయస్సు వున్న నరేష్ తో చట్టపట్టలేసుకొని తిరుగుతూ వార్తల్లో నిలుస్తోంది. నరేష్, పవిత్ర లోకేష్ ఓకే హోటల్ రూమ్లో కనిపించడంతో ఇక ఇమేజ్ మొత్తం డామేజ్ అయిందని చెప్పాలి. మరొకవైపు మళ్లీ పెళ్లి అనే పేరుతో తరచూ తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కూడా ఈమెకు ఆఫర్లు రోజురోజుకు పెరుగుతున్నాయని చెప్పాలి. కొన్ని నెలల క్రితం వరకు రూ.60 వేల వరకు పారితోషకం అందుకున్న పవిత్ర ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలకు ఆమె పారితోషకం పెరిగిందని సమాచారం.

ఇకపోతే ఇప్పుడు మళ్లీ పెళ్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఈ సినిమా కోసం ఏకంగా రూ.10 కోట్ల వరకు పారితోషకం అందుకుందని సమాచారం. ఇకపోతే ఎక్కువగా తల్లి పాత్రలతో పాటు అక్క, వదిన పాత్రలలో కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. టెంపర్ సినిమా సక్సెస్ తర్వాత పవిత్ర లోకేష్ కి అవకాశాలు బాగా పెరిగిపోయాయి. పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా పవిత్ర లోకేష్ ను ప్రేమగా మమ్మీ అంటూ పిలుస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే ఒక్కసారిగా మళ్లీ పెళ్లి సినిమా కోసం హీరోయిన్ కంటే ఎక్కువ పారితోషకం తీసుకున్న ఈమెకు ఇక అవకాశాలు వస్తాయా లేదా అన్నది మరింత ఆసక్తికరంగా మారింది. ప్రజలలో ఈమె పై నెగిటివ్ ప్రచారం జరుగుతున్నప్పటికీ సినిమా రంగంలో మాత్రం ఆమెపై ఇంకా పాజిటివ్ ఒపీనియన్ ఉండడం గమనార్హం. మొత్తానికి అయితే పవిత్ర లోకేష్ ఇంత పారితోషకం తీసుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news