డింపుల్‌ హయాతి ఇంట్లోకి చొరబడ్డ యువతీయువకుడు

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్‌ హయాతి ఇంట్లోకి ఓ యువతి, యువకుడు ప్రవేశించడం కలకలం రేపింది. హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్‌ ఎస్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌లో డింపుల్‌ ఆమె సహచరుడు విక్టర్‌ డేవిడ్‌తో కలిసి ఉంటోంది. అదే అపార్ట్‌మెంట్‌లో నివసించే ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్డేతో పార్కింగ్‌ వివాదంలో డింపుల్‌, డేవిడ్‌లపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే.. గురువారం ఉదయం సీ2లో ఉండే డింపుల్ అపార్ట్‌మెంట్‌లోకి యువతి, యువకుడు ప్రవేశించారు.

పనిమనిషి ఎవరని ఆరా తీసే ప్రయత్నం చేయ. ఇంతలో ఇంట్లోని కుక్క వారి వద్దకు వెళ్లడంతో భయపడి తిరిగి లిఫ్టులోకి వెళ్లారు. లిఫ్టు లోపలికి వారితో పాటు వెళ్లిన కుక్క తిరిగి వెంటనే బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న డింపుల్‌ వెంటనే డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు యువతీయువకుల్ని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. వారిని విచారించగా తాము రాజమండ్రి నుంచి వచ్చామని, డింపుల్‌ అభిమానులమని పేర్కొన్నారు.