బాలయ్య-బోయపాటి కాంబో రిపీట్.. ‘లెజెండ్‌-2’కు సన్నాహాలు!

-

టాలీవుడ్​లో సెన్సేషనల్ డైరెక్టర్-యాక్టర్ కాంబోలో నంబర్ వన్ ప్లేస్​లో ఉంటుంది నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్​గా అఖండతో అఖండ విజయాన్ని మూటగట్టుకుంది ఈ కాంబో. ఈ నేపథ్యంలో అఖండకు సీక్వెల్ ప్లాన్చ చేశారని అప్పట్లో సినీ వర్గాల్లో టాక్ నడిచింది. అయితే ప్రస్తుతం అఖండ సీక్వెల్​ కాదు కానీ ఈ కాంబోలో తెరకెక్కిన మరో బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ ప్లాన్​లో ఉందట ఈ కాంబో. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..?

ప్రస్తుతం బాలయ్య బాబు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తన 108వ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే బాలకృష్ణ 109 చిత్రాన్ని చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ జన్మదినమైన జూన్‌ 10న ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఈ సినిమా గత ఏడాది అద్భుత విజయం సాధించిన ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌ కాదని.. ‘లెజెండ్‌’కు కొనసాగింపుగా ఉంటుందని తాజా సమాచారం. ఇందులో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news