దీపిక ధరించిన వాచ్ ఖరీదు తెలిస్తే షాక్..!

-

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకొని.. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో అగ్ర కథానాయకగా స్థానం ఏర్పాటు చేసుకున్న దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించిన ఈమె స్టార్ హీరో రణ్బీర్ కపూర్ ను వివాహం చేసుకొని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా మారింది. ఇప్పటివరకు హిందీలో నటించిన దీపిక ఇప్పుడు తొలిసారి తెలుగు తెరకు కూడా పరిచయం కాబోతోంది. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రాజెక్టుకే చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది.

గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా దీపికాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. అదేంటంటే ఆమె ధరించిన వాచ్ ధర.. ఎంతలా అంటే ఆమె వాచ్ ప్రైస్ మనీ తో ఏకంగా ఒక లగ్జరీ ఇల్లు ని కొనేయచ్చట. ఈ మధ్యకాలంలో విమానాశ్రయంలో ఎంతో సింపుల్ గా కనిపించిన దీపిక ఆమె తన లగ్జరీ బ్రాండ్ అయినా కార్టియర్ నుంచి అద్భుతమైన PANTHRE DE CARTIER వాచ్ ధరించింది. దీనిని 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. ఇందులో రోమన్ సంఖ్యలు సమయాన్ని తెలియజేయడమే కాకుండా లోపల ఉన్న నీలిరంగు వెండి ముళ్లను అమర్చారు.

 

ఇది వాటర్ ప్రూఫ్. దీని విలువ రూ.21,65,000.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. వాస్తవానికి దీపికా కు వాచీలు అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు ఆమె వద్ద ఉన్న హైయెస్ట్ ప్రైస్ వాచ్ లలో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం దీపిక ప్రాజెక్ట్ కే లోనే కాకుండా ఫైటర్ చిత్రంలో కూడా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news