హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిని నరికి చంపారు కొంత మంది దుండగులు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం జరిగింది. నాగారం శివారు ప్రాంతమైన అర్.టి.సీ కాలనీ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అశోక్ నివాసం ఉంటున్నాడు.
అయితే.. నిన్నరాత్రి అశోక్ పై తన ఇంటి వద్ద కత్తులతో దాడి చేశారు గుర్తు తెలియని నలుగురు దుండగులు. స్థానికంగా ఉన్న జనం కేకలు వేయడంతో పరారయ్యారు హంతకులు. అయితే.. తీవ్ర రక్త స్రావం లో పడి ఉన్న అశోక్ ను హుటా హుటిన పక్కనే ఉన్న సైన్ హాస్ప టల్ కు తరలించారు కుటుంబ సభ్యులు. కానీ చికిత్స పొందుతూ మృతి చెందాడు అశోక్. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.