క‌రోనా క‌ల్లోలంలోనూ ఆగ‌ని షూటింగులు.. మంచిదే అంటున్న ఫ్యాన్స్‌

క‌రోనా దెబ్బ‌కు దేశ‌మే అతలాకుత‌లం అవుతోంది. ఇక దీని ప్ర‌భావం సినీ ఇండ‌స్ట్రీపై ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పెద్ద‌, పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. చాలా సినిమాలు రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా షూటింగ్ ను నిలిపివేస్తున్నాయి. ఇప్ప‌టికే స‌ర్కారువారి పాట‌, ఆర్ ఆర్ఆర్, ఆచార్య‌, ర‌వితేజ మూవీ.. ఇలా పెద్ద సినిమాలు షూటింగ్ ను నిలిపివేశాయి. కానీ ఈ క‌ల్లోలంలోనూ కాస్త ఊర‌నిచ్చే విష‌యం ఏంటంటే.. కొన్ని సినిమాలు షూటింగ్ జ‌రుపుతున్నాయి.


నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేష‌న్ లో వ‌స్తున్న అఖండ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. కరోనా కేసులు ఓ రేంజ్ లో న‌మోద‌వుతున్నా.. షూటింగ్ మాత్రం ఆప‌ట్లేదు నిర్మాత‌లు. దీంతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కిస్తున్న పుష్ప మూవీ కూడా షూటింగ్ ఆప‌లేదు. కాగా ఈ మూవీని ప‌బ్లిక్ లేని ప్లేస్ లో కాకుండా నిర్మానుష్య ప్లేస్ లో తెర‌కెక్కిస్తుండ‌టంతో షూటింగ్ కు ఇబ్బంది లేదంట‌. నేచుర‌ల్ స్టార్ నాని నటిస్తున్న సింగ‌రాయ్ సినిమా కూడా ఆగిపోలేదు.

అలాగే డైరెక్ట‌ర్ భూపతి డైరెక్ట‌ర్ గా శర్వానంద్, సిద్ధార్థ హీరోలుగా తెర‌కెక్కుతున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ కూడా షూటింగ్ జ‌రుపుతోంది. అలాగే నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ తీస్తున్న థాంక్యూ సినిమా కూడా షూటింగ్ జ‌ర‌పుతున్నార‌ని స‌మాచారం. ఇలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగులు జ‌ర‌ప‌డం ఇండ‌స్ట్రీకి మంచిదే అని చెప్పాలి. ఇలాగే మిగ‌తా సినిమాలు నిర్మానుష్య ప్రాంతాల్లో షూటింగులు తీస్తే సినీ కార్మికుల‌కు ప‌ని దొరికుతుంద‌ని ఆశ‌ప‌డుతున్నారు.