బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ డాన్స్ ప్రోగ్రాం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణ భారతదేశంలోనే బిగ్గెస్ట్ డాన్స్ రియాల్టీ షోగా గుర్తింపు పొందిన ఈ షో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇక ప్రతి సీజన్ కి కూడా జడ్జిలు మారుతూ ప్రేక్షకులను మరింత అలరిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే 14వ సీజన్ జరుపుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఈ షోలో కిరణ్ మచ్చా గొడవ చేయడం సంచలనంగా మారింది. దీంతో హీరోయిన్ శ్రద్ధదాస్ ఏడ్చుకుంటూ స్టేజి నుంచి వెళ్ళిపోయింది. అసలేం జరిగిందో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
ప్రస్తుతం సీజన్ 14 ..ది డాన్సింగ్ ఐకాన్ పేరిట ప్రసారమవుతుందనే విషయం తెలిసింది. ముఖ్యంగా గతంలో లాగా కాకుండా పూర్తిగా కొత్త వాళ్లను తీసుకురావడం జరిగింది. ఇందులో నాలుగు జట్లు పోటీ పడుతుండగా ఒక్కొక్క జట్టుకి కూడా మంచి ప్రేక్షకాదరణ లభిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ సీజన్లో కపుల్స్, సోలో, ఛాంపియన్స్ , లేడీస్ టీమ్ల మధ్య పోటీ మొదలుపెట్టారు. ఈ నాలుగు టీములకు హైపర్ ఆది, నవ్య స్వామి, రవికృష్ణ, కిరణ్ మచ్చాలు టీం లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే జడ్జిలుగా గణేష్ మాస్టర్, శ్రద్ధాదాస్ , నందితా శ్వేత వ్యవహరిస్తుండగా ప్రదీప్ మాచిరాజు హో స్టుగా చేస్తున్నాడు.
ఇక కొరియోగ్రాఫర్ స్పెషల్ రౌండులో కంటెస్టెంట్లతో పాటు కొరియోగ్రాఫర్ కూడా వచ్చి ఇందులో డాన్స్ చేయాల్సి ఉంటుంది. తాజాగా దీనికి సంబంధించిన ఒక ప్రోమో ను నిర్వాహకులు విడుదల చేయగా అందులో కొరియోగ్రాఫర్ స్పెషల్ రౌండులో చైతన్య మాస్టర్ రాజశేఖర్ పాటలకు డాన్స్ వేశాడు. గతంలో రాజశేఖర్ తో కలిసి పనిచేసిన శ్రద్ధాదాస్ వచ్చి కూడా అదిరిపోయే స్టెప్పులు వేసింది.దీని పై ఫ్రాంక్ స్టార్ కిరణ్ మచ్చ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇక ప్రదీప్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కిరణ్ ప్రదీప్ ని కూడా తిట్టాడు.
పిల్లల టీంకు సపోర్టు చేసేందుకు వచ్చిన కిరణ్ శ్రద్ధాదాస్ వచ్చి డాన్స్ చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు మా పిల్లలు కూడా మంచిగానే డాన్స్ వేశారు కదా మేడం.. ఇప్పుడు వచ్చి డాన్స్ చేశారు. దీన్ని బట్టి చూస్తే మీరు పార్శియాలిటీ చేస్తున్నట్లు అనిపిస్తోంది అనడంతో ప్రదీప్ కూడా గొడవకు దిగాడు. ఇక ఆ తర్వాత ఆది, రవి కృష్ణ కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేయగా కిరణ్ మచ్చ వారిపై పెద్ద రాద్ధాంతం చేశాడు. దీంతో శ్రద్ధ ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయింది. యాంకర్ ప్రదీప్ కూడా వాక్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ గా మారింది.