“లాల్ సింగ్ చడ్డా” నుంచి చైతూ లుక్‌ రిలీజ్‌

-

అమీర్ ఖాన్‌ లేటెస్ట్‌ మూవీ లాల్‌ సింగ్‌ చడ్డా. హాలీవుడ్‌ మూవీ ఫారెస్ట్‌ గంప్‌ అధికారిక రీమేక్‌ గా తెరకెక్కింది. దర్శకుడు అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 11న లాల్‌ సింగ్‌ చడ్డా వరల్డ్‌ వైడ్‌ గా రిలీజ్‌ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోలాల్‌ సింగ్‌ చడ్డా సినిమాను విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమానను చిరంజీవి ప్రజెంట్‌ చేస్తున్నారు.

గీతాఆర్ట్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. చిరంజీవి లాల్‌ సింగ్‌ చడ్డాను ప్రత్యేకంగా ప్రమోట్‌ చేస్తున్నారు. ఇటీవల చింరజీవి నివాసం లో లాల్‌ సింగ్‌ చడ్డా ప్రీమియర్‌ ప్రదర్శన జరిగింది. అమీర్‌ ఖాన్‌ తో పాటు పరిశ్రమ ప్రముఖులైన నాగార్జున, సుకుమార్‌, తదితరులు పాల్గొన్నారు. ఇక తాజాగా ఈ సినిమా నాగ చైతన్య లుక్‌ ను కూడా రివీల్ చేశారు. చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా చైతూ లుక్‌ రిలీజ్‌ చేశారు. “‘లాల్ సింగ్ చడ్డా’, చెడ్డీ బడ్డీ ‘బాలరాజు’ ని మీకు పరిచయం చేస్తున్నాను. అలనాటి ‘బాలరాజు’ మనవడు మన అక్కినేని నాగ చైతన్యే ఈ బాలరాజు.” అంటూ ట్వీట్‌ చేశారు చిరు.

Read more RELATED
Recommended to you

Latest news