Shriya Saran: తల్లయి ఏడాదైపోయిందట..! మ‌తిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన హాట్ బ్యూటీ

-

Shriya Saran: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ‌య స‌ర‌న్‌. తన అపురూప అందం, అభినయంతో.. దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగుతో పాటుగా, తమిళ, హింది చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కుర్ర హీరోయిన్‌లతో సమానంగా అందాలను ఆరబోస్తోన్న ప్రేక్షకులను అలరించించింది.

పెళ్లి తర్వాత సినిమాలకి కాస్తా బ్రేక్ ఇచ్చింది. వీలునున్న‌ప్పుడ‌ల్లా.. సినిమాల్లో మెరుస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ‌. త‌న‌ హాట్ హాట్ ఫొటోలతో నెటిజ‌న్లు మ‌తిపోగొడుతుంది. లైవ్ చాట్ క‌నిపించి ఫాన్స్ ను పలకరిస్తూ ఉంటుంది.

ఇటీవ‌ల ఈ ముద్దుగుమ్మ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చి అంద‌రిని షాక్ చేసింది. ఇంతకు ఆ సీక్రెట్ ఏంటంటే.. శ్రియ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శ్రియ రష్యన్‌ క్రీడాకారుడు, బిజినెస్‌ మ్యాన్‌ ఆండ్రీ కోషీవ్‌‌ని వివాహమాడిన విషయం తెలిసిందే.. ర‌ష్యాలోనే భర్తతో పాటు సెట్టిల్ అయింది. అయితే రీసెంట్ గా ఆమె ఓ షాకింగ్ స్వీట్ న్యూస్ చెప్పింది. 2020 సంవత్సరంలో శ్రియ బిడ్డకు జన్మ నిచ్చిన‌ట్టు తెలుస్తుంది.

“2020వ సంవత్సరం మొత్తం ప్రపంచం చాలా కష్టపెట్టింది. ఏడాది మొత్తం అందరూ క్వారెంటైన్‌లోనే ఉండిపోయారు. కరోనా కారణంగా అంద‌రూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ఏడాది అంద‌రూ క్వారెంటైన్‌లోనే ఉండిపోవాల్సి ఉంది. కానీ మా జీవితంలో మాత్రం ఓ అద్భుతం జరిగింది. చిన్నారి రాకతో మా ప్రపంచమే మారిపోయింది. మాకొక ఏంజిల్‌ని ఇచ్చినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను” అంటూ శ్రియ గుడ్ న్యూస్‌ను షేర్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news