యువకుడి ఆత్మహత్య… ప్రధాని మోడీ తన చివరికోరిక తీర్చాలంటూ లేఖ

మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చెందిన 16 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను మంచి డ్యాన్సర్ కావడం లేదని, డ్యాన్సుల్లో రాణించలేకపోతున్నానని ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తను చనిపోతూ విచిత్ర కోరిక కోరాడు. మ్యూజిక్ ఆల్బమ్ ను నిర్మించాలనే తన కోరికను తీర్చాల్సిందిగా ప్రధాని మోడీని కోరుతూ సూసైడ్ నోట్ రాశాడు. ఇందులో ఒక పాటను ప్రముఖ సింగర్ అర్జిత్ సింగ్ పాడాలని, నేపాల్ కు చెందిన సుశాంత్ కత్రి కొరియోగ్రఫీ చేయాలని నోట్ లో కోరాడు.

dead

గ్వాలియర్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రాంతానికి చెందిన కుర్రాడు ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్నాడు. తను మంచి డ్యాన్సర్ కావడానికి తన కుటుంబసభ్యులు, స్నేహితులు సహకారం అందించలేదని లేఖలో పేర్కొన్నారు. రైల్ కింద తలపెట్టి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్ పై  యువకుడి శవాన్ని, సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.