ఇండియన్-2.. విలన్ సిద్ధార్థ్..!

-

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో రెండు దశాబ్ధాల తర్వాత వస్తున్న సీక్వల్ ఇండియన్-2. కమల్, శంకర్ తప్ప మిగతా వారంతా కొత్తవారే. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ గా సిద్ధార్థ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. కొన్నాళ్లుగా సిద్ధార్థ్ కు సరైన సక్సెస్ లు లేవు.. హీరోగానే కాదు విలన్ పాత్రలకు సై అంటున్నాడు. అందుకే శంకర్ ఇండియన్-2లో సిద్ధుని విలన్ గా సెలెక్ట్ చేశాడట.

శంకర్ డైరెక్ట్ చేసిన బోయ్స్ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్ ఇన్నాళ్లకు మళ్లీ శంకర్ డైరక్షన్ లో అది కూడా విలన్ గా టర్న్ అవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈమధ్యనే మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కాని కొద్దిపాటి గ్యాప్ తో యధావిధిగా షూటింగ్ జరుగుతుందట. సినిమాలో తెలుగు కమెడియన్ వెన్నెల కిశోర్ కూడా ఇంపార్టెంట్ రోల్ పోశిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఇండియన్-2 లో ఇన్ని హైలెట్స్ ఉండగా సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news