ఆ హీరోయిన్ బయోపిక్.. హీరోల గుండెల్లో గుబులు..!

-

బాలీవుడ్ లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన కంగానా రనౌత్ లేటెస్ట్ గా మణికర్ణిక సినిమాతో మరోసారి తన సత్తా చాటారు. సినిమా రిలీజ్ టైంలో దర్శకుడు క్రిష్ నటుడు సోనూ సూద్ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్. సినిమాను ఎవరు ప్రమోట్ చేయట్లేదని ఆమీర్ ఖాన్ వంటి హీరోలను ఆడేసుకుంది. ఇక లేటెస్ట్ గా ఆమె తన బయోపిక్ సినిమా చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది.

కంగనా రనౌత్ బాలీవుడ్ లో ఖాన్ హీరోలతో పాటుగా క్రిష్ తో కూడా గొడవలు పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ హీరోయిన్ బయోపిక్ అనగానే ఆ హీరోల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ బయోపిక్ లో కంగనా ఏ విషయాలను బయట పెడుతుంది అని అందరు కంగారు పడుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ దశ జరుగుతున్న ఈ సినిమా అఫిషియన్ ఎనౌన్స్ మెంట్ త్వరలో వెళ్లడిస్తారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news