సైమా-2018 విజేతలు వీరే..!

-

ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ప్రత్యేకంగా ఇస్తారు. కేవలం సౌత్ సిని పరిశ్రమలో జరిగే ఈ వేడుకకు అంగరంగ వైభవంగా దుబాయ్ వేదిక అవుతుంది. ఈ ఇయర్ సైమా వేడుకలు దుబాయ్ లో సెప్టెంబర్ 14, 15 తారీఖులల్లో జరుగుతున్నాయి. ఇక ఈ అవార్డుల్లో బాహుబలి మరోసారి తన ప్రతాపం చూపించింది. ఉత్తమ సినిమా, హీరో, విలన్, మ్యూజిక్ డైరక్టర్, సింగర్ విభాగాల్లో బాహుబలి-2 సైమా అవార్డులు అందుకుంది.

సైమా 2018 టాలీవుడ్ అవార్డ్ విన్నర్స్ లిస్ట్ ఇదే..

ఉత్తమ హీరో : ప్రభాస్ (బాహుబలి-2)
ఉత్తమ హీరోయిన్ : కాజల్ (నేనే రాజు నేనే మంత్రి)
ఉత్తమ చిత్రం : బాహుబలి-2
ఉత్తమ సహాయ నటుడు : ఆది (నిన్ను కోరి)
ఉత్తమ సహాయ నటి : భూమిక (ఎంసీఏ)
ఉత్తమ విలన్ : రానా (బాహుబలి 2)
ఉత్తమ గాయని : మధుప్రియ (ఫిదా)
ఉత్తమ గాయకుడు : కాలభైరవ (బాహుబలి-2)
ఉత్తమ సంగీత దర్శకుడు : ఎంఎం కీరవాణి (బాహుబలి-2)
ఉత్తమ దర్శకుడు : రాజమౌళి (బాహుబలి-2)

Read more RELATED
Recommended to you

Exit mobile version