చిరు కాళ్ల మీద మోకరిళ్లిన బేబి

-

ఈమధ్య సోషల్ మీడియాలో స్వతహాగా బేబి పాడిన పాట ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా వడిసేలేరు గ్రామానికి చెందిన 40 ఏళ్ల బేబి పొలం పనులు చేసుకుంటూ ఉంటుంది. చిన్ననాటి నుండి పాటలు పాడటం అలావాటు చేసుకున్న బేబి ఈమధ్య ఓ సాంగ్ పాడిన వీడియో సోషల్ మీడియాలో పెట్టింది. ఆ వీడియోకి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

ఏకంగా అకడెమీ అవార్డ్ విన్నర్ రెహమాన్ ఆమె పాటకు స్పందించడం జరిగింది. ఇక చిరంజీవి బేబి పిలిపించి ప్రత్యేకంగా ప్రశంసించారు. చిరంజీవిని చూడగానే బేబి చిరు కాళ్ల మీద పడి తన జన్మకు ఇది చాలంటూ భావోద్వేగమైందట. తన భార్య సురేఖ వల్ల బేబి గురించి తెలుసుకున్నానని చెప్పిన చిరంజీవి ఇలాంటి ప్రతిభ అందరికి ఉండదని మీ అవసరం పరిశ్రమకు చాలా ఉందని చెప్పారట.

బేబికి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నుండి కూడా పిలుపు అందిందట. పొలం పనులు చేసుకుంటూ ఉండే బేబిలో సింగింగ్ టాలెంట్ ఉండటం అది ప్రపంచం గుర్తించడం చూస్తుంటే ఒక్కోసారి సోషల్ మీడియా వల్ల మంచి కూడా జరుగుతుందని అనిపిస్తుంది. ఏది ఏమైనా బేబి ఇక మీదట బాత్ రూం సింగర్ గా కాదు ప్లే బ్యాక్ సింగర్ గా పనిచేస్తుంది.. ప్రేక్షకులను అలరిస్తుంది. సింగర్ గా ఆమె కెరియర్ సక్సెస్ కావాలని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news