ఒకరాత్రికి నీ రేటెంత.. సింగర్ పై నెటిజెన్ల ట్రోలింగ్

-

మీటూ మూమెంట్ మీద ఇంకా తన మాట వినిపిస్తున్న సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి కోలీవుడ్ లో ప్రముఖ రచయిత వైరముత్తు మీద చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తండ్రి వయసు ఉన్న వైరముత్తు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చిన్మయి మీటూ మూమెంట్ లో భాగంగా స్పందించింది. అప్పటి నుండి ఆమె మీద నెగటివ్ ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు నెటిజెన్లు.

అయితే ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆధారాల్లాంటివి లేవు కాబట్టి వాటిపై యాక్షన్ తీసుకోలేదు. ఆమెను డబ్బింగ్ యూనియన్ నుండి కూడా బహిష్కరించారు. భారత సమాజంలో బాధితులకు న్యాయం జరగడం అంత సులువైనదేమి కాదని.. వారు మరణిస్తేనో.. హత్యకు గురయితేనో విషయాన్ని సీరియస్ గా తీసుకుంటారని అన్నది. ఇప్పటికి ఆమెపై నెటిజెన్లు ట్రోల్స్ ఆపట్లేదని.. కొందరైతే ఒక రాత్రికి నువ్వు ఎంత తీసుకుంటావు అంటూ కామెంట్స్ చేస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది చిన్మయి. అయితే ఈ కామెంట్స్ పై ఆమె లీగల్ యాక్షన్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version