అవకాశాల కోసం అన్ని వదిలేసిన తమన్నా..!

-

నిన్న మొన్నటిదాకా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఛాన్సులు దక్కించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు ఖాళీ అయిపోయింది. కొత్త హీరోయిన్స్ వస్తున్న కారణంగా సీనియర్ హీరోయిన్స్ కు కష్ట కాలం వచ్చింది. అయినా సరే అడపాదడపా అవకాశాలతో ఎలాగోలా కెరియర్ నెట్టుకొస్తున్నారు. ఈమధ్యనే వచ్చిన ఎఫ్-2 సినిమాలో నటించి మెప్పించిన తమన్నా క్వీన్ తెలుగు రీమేక్ లో నటించింది.

ఆ సినిమా వచ్చే నెల రిలీజ్ కానుంది.. ముందు హీరోయిన్ గా ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఐటం గాళ్ గా కూడా మారిన తమనా ఇప్పుడు ఛాన్సుల కోసం మొహమాటం లాంటివి వదిలేసిందట. ఆఫర్ల కోసం ఎలాంటి పాత్రలకైనా సరే రెడీ అని చెబుతుందట తమన్నా.. కెరియర్ ఎలాగు ముగింపు దశకు వచ్చేసిందని డిసైడ్ అయిన అమ్మడు ఇప్పుడిక మడికట్టుకు కూర్చుని లాభం లేదని అందాల ప్రదర్శనకు సై అంటుందట. మరి తమన్నాలో ఆ యాంగిల్ ను ఏ డైరక్టర్ వాడుతాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version