టాలీవుడ్ సింగర్ కు ఫోన్ వేధింపులు.. గొంతు మార్చి శివారెడ్డి ఏం చేశాడు అంటే..!

-

తన అందమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సినిమా పాటలు పాడిన మాళవిక గురించి అందరికి తెలిసిందే. వెరీ టాలెంటెడ్ సింగర్ అయిన మాళవిక ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో ఫోన్ వేధింపుల విషయాల గురించి బట్టబయలు చేసింది. అంతేకాదు ఓ ఈవెంట్ లో భాగంగా గీథామాధురి, శివారెడ్డిలతో తాను వెళ్లగా తాను చనిపోయినట్టుగా వార్తలు వచ్చాయని చెప్పింది.

పాటలు పాడుతూ బిజీగా ఉన్న తనకి ఎవరో ఒకతని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా ఎప్పుడుపడితే అప్పుడు ఫోన్ చేసి వేధించాడని ఆ టైంలో ఏం చేయాలో తెలియలేదని విషయం గీతా మాధురికి చెప్పగా శివా రెడ్డి సాయంతో అతనికి ఫోన్ చేసి డిఎస్పిలా గొంతు మార్చి అతనికి వార్నింగ్ ఇచ్చాడని చెప్పింది. ఆ దెబ్బతో అతను మళ్లీ తనకు ఫోన్ చేయలేదని చెప్పింది మాళవిక.

Read more RELATED
Recommended to you

Exit mobile version