సింగర్ సుశీలకు స్వల్ప అస్వస్థత.. హాస్పిటల్​లో చికిత్స

-

ప్రముఖ సినీ నేపథ్య గాయని, పద్మభూషణ్‌ గ్రహీత పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యానికి గురైజన ఆమెను కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 86 ఏళ్ల సుశీల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తాజాగా ఆమెకు కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాల ద్వారా తెలిసింది. అయితే సుశీల ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానులంతా ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో సుశీలమ్మతొందరగా కోలుకోవాలని సన్నిహితులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.

తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో సుశీల వేలకు పైగా పాటలు పాడారు. ముఖ్యంగా తెలుగులో ఆమె పాడిన పాటలు ఆణిముత్యాలు. అందులోనూ విధాత తలపున ప్రభవించినది అనే పాట నాటి నుంచి నేటి తరానికీ ఫేవరెట్ గా నిలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news