పద్మశ్రీ అందుకున్న సిరివెన్నెల..!

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రికి పద్మశ్రీ ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు దశాబ్ధాలుగా తెలుగు సినిమా పరిశ్రమకు తన సాహిత్యాన్ని అందిస్తూ కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈరోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదగా పద్మశ్రీ అందుకున్నారు.

ఢిల్లిలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రముఖులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. తెలుగు సాహిత్యానికి ఆయన అందించిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డ్ వచ్చింది. ఆయనకు పద్మశ్రీ ప్రకటించిన టైంలోనే తెలుగు పరిశ్రమ మొత్తం ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది.