స్లీవ్ లెస్ టాప్ అందాలతో కవ్విస్తున్న శివాత్మిక..!

-

స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో కట్టిపడేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందమైన నటనతో మెస్మరైజ్ చేస్తోంది. ఎప్పుడూ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్న శివాత్మిక సోషల్ మీడియాలో మాత్రం తన టాలెంట్ మొత్తం చూపిస్తోంది అని చెప్పవచ్చు. రాజశేఖర్ , జీవితల చిన్న కూతురు శివాత్మిక రంగమార్తాండ సినిమా ద్వారా తన నటనతో తానేంటో నిరూపించుకుంది. సహజమైన నటనతో ఫిదా చేసిన ఈమె విమర్శకుల ప్రశంసలు అందుకొని భవిష్యత్తు మహానటి అంటూ మన్ననలు కూడా పొందింది.

ఇకపోతే నటిగా మంచి పేరు దక్కించుకున్న ఈ యంగ్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే అప్పుడప్పుడు గ్లామర్ కి దూరంగా ఉంటూ మేకప్ లేకుండానే ఎన్నోసార్లు ఫోటోలు పంచుకొని అందరి చేత శభాష్ అనిపించింది. ముఖ్యంగా మేకప్ లేకపోయినా సహజమైన అందంతో అందరినీ కట్టిపడేస్తూ ఉంటుంది. తాజాగా స్లీవ్ లెస్ బ్లూ టాప్ ధరించి సిగ్గులోలికిస్తూ అమాయకంగా అందులోనే చిన్న స్మైల్ తో ఈమె ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు మతిపోయేలా అనిపిస్తోంది. ఇక తన అక్క శివానితో కలిసి ఒక కొంటె ఫోజు ఇచ్చిన ఈమె అందులో మెహందీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం శివాత్మిక షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక శివాత్మిక సినీ కెరియర్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద దేవరకొండ నటించిన దొరసాని చిత్రం ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత పంచతంత్రం, రంగమార్తాండ సినిమాలలో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు మంచి స్కోప్ ఉన్న పాత్ర కోసం ఎదురుచూస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news