బాలీవుడ్ నటి సోనాలి బింద్రేకు గత కొద్ది రోజుల కిందట హైగ్రేడ్ క్యాన్సర్ వచ్చిందనే విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఆమే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించింది. అయితే క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కు గాను సోనాలి ఇప్పటికే న్యూయార్క్‌కు కూడా చేరుకుంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు తన ట్రీట్‌మెంట్ వివరాలను ట్విట్టర్ ఖాతాలో తెలియజేస్తూ వస్తోంది. ఇక తాజాగా సోనాలి తన ట్రీట్‌మెంట్ అప్‌డేట్ గురించి మరో ఫొటోను పోస్ట్ చేసింది.
సోనాలి బింద్రే తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలో ఆమె పూర్తిగా గుండుతో కనిపించింది. క్యాన్సర్ కు ఇచ్చే ట్రీట్‌మెంట్‌లో భాగంగా తలపై జుట్టు తీసేస్తారని తెలిసిందే. అందుకోసమే సోనాలి కూడా తన జుట్టును తీసేసింది. ఈ క్రమంలోనే తన కొత్త లుక్ ఇది అంటూ.. ఆమె ఆ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, ప్రస్తుతం ఆ ఫొటో నెట్‌లో వైరల్ అవుతోంది.
సోనాలి బింద్రే తన బి టౌన్ ప్రెండ్స్ అయిన సుసానే ఖాన్, గాయత్రి జోషి లతో కలిసి దిగిన తన బాల్డ్ లుక్ ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన వెంటనే చాలా మంది ఆమె లుక్ పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయినా సోనాలికి వారు బెస్ట్ విషెస్ తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెట్టారు.