హీరోగా చేస్తానంటున్న సోనూసూద్‌.. క్రిష్ క్రియేటివిటీలోనే!

-

ప్ర‌స్తుతం సోనూసూద్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సేతు హిమాల‌యాల నుంచి ఇటు వింధ్యా ప‌ర్వ‌తాల దాకా ఆయ‌న పేరునే జ‌పిస్తోంది. రీల్ లైఫ్ లో విల‌న్ అయినా.. రియ‌ల్ లైఫ్ హీరోగా జ‌నాల గుండెల్లో నిలిచిపోయారు. ఆయ‌న చేస్తున్న సేవ‌ల‌కు ప్ర‌జ‌ల్లో ఎంతో ఫేమ‌స్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఆయ‌న హీరోగా ఎంట్రీ ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇందుకోసం టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ ముందుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు కొవిడ్ కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డింది. ఈ గ్యాప్‌ను డైరెక్ట‌ర్ బాగానే వినియోగించుకున్నాడు.

సోనూసూద్‌కు ఓ క‌థ చెప్ప‌గా.. ఆయ‌న ఓకే కూడా చెప్పేశాడంట‌. మ‌ణిక‌ర్ణిక సినిమా నుంచి సోనూసూద్ కార‌ణంగానే క్రిష్ త‌ప్పుకున్నాడు. ఆ వెంట‌నే సోనూ కూడా ఆ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ సాన్నిహిత్య‌మే ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా రావ‌డానికి కార‌ణం. మ‌రి ఈ సినిమాను ప్యాన్ ఇండియ‌న్ మూవీగా తెర‌కెక్కించే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news