హాలీవుడ్ స్టార్‌ల స‌ర‌స‌న సోనుసూద్!‌

-

లాక్‌డౌన్ స‌మ‌యంలో రియ‌ల్ హీరోగా నిలిచిన సోనుసూద్‌కు అరుదైన పుర‌స్కారం ల‌భించింది. ఇటివ‌ల త‌ను చేసిన సేవ‌ల‌కు గానూ ఐక్య‌రాజ్య‌స‌మిత అనుబంధ సంస్థ యునైటెడ్ నేష‌న్స్ డెవ‌లాప్‌మెంట్ ప్రోగ్రామ్ సోనుసూద్‌కి ఎస్‌డీజీ స్పెష‌ల్ హ్యుమానిటేరియ‌న్ అవార్డుని అంద‌జేసింది. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎంతో మంది వ‌ల‌స కూలీల‌కు, విద్యార్థుల‌కు, నిస్స‌హాయుల‌కు సేవ‌లందించినందుకు గానూ ఆయ‌న‌కు ఈ అవార్డు ద‌క్కింది.

వ‌ర్చువ‌ల్ కార్య‌క్ర‌మంలో సోమ‌వారం సాయంత్రం ఈ అవార్డును ప్ర‌దానం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐరాస అవార్డుని అందుకున్న హాలీవుడ్ న‌టులు ఏంజిలీనా జోలీ, డేవిడ్ బెక్‌హామ్‌, లియోనార్డో డికాప్రియో, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ల స‌ర‌స‌న సోనుసూద్ నిలిచారు. ఇదొక గౌర‌వం. ఐరాస గుర్తింపును పొంద‌డం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. నాకు వీలైన విధంగా దేశ ప్ర‌జ‌ల‌కు చేయ‌గ‌లిగిన స‌హాయాన్ని చేశాను` అని సోనుసూద్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news