దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ తగ్గుతూ వస్తోంది. మొదట్లో ఉన్నంత ఆదరణ ఇప్పుడు కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఆయన పరిపాలన పై అనుమానాలు పెరిగిపోయాయి. తన రాజకీయ వ్యూహాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని, ప్రజలను కష్టాల నుంచి బయట పడేస్తారు అని ఆయన పై ఎక్కువ అభియోగాలు వచ్చాయి. ఇక కరోన సమయంలో దేశంలోని ప్రజలందరికీ ఉపయోగపడేలా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించినా, అది ప్రజలు ఎవరికీ ఉపయోగపడేలా లేదనే పెదవి విరుపులు వచ్చాయి.
ఇక కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణలు బిజెపి ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విద్యుత్ సంస్కరణలు, వ్యవసాయ బిల్లులు వంటివి బీజేపీపై ఎన్డీఏలో ని మిత్రపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోవడం, కొంతమంది మంత్రి పదవులకు రాజీనామా చేయడం, మరికొన్ని పార్టీలు ఎన్డీయే నుంచి బయటకు వెళ్లే ఆలోచనలో ఉండడం ఇవన్నీ బీజేపీకి ఎదురు దెబ్బలే. ప్రస్తుతం ఏపీ వ్యవహారానికి వస్తే ఇక్కడ టిడిపిని ఒక ఒడ్డున పడేయడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు . బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా, టిడిపి రాజకీయ భవిష్యత్ కు ఎటువంటి డోకా లేకుండా చేయవచ్చని, ఆ పార్టీ సహకారంతో 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చనే అభిప్రాయంతో బిజెపి వెంట చంద్రబాబు పడుతున్నారు.
ఆ పార్టీ టీడీపీత పొత్తు పెట్టుకునేందుకు సుముఖత వ్యక్తం చేయకపోయినా, బాబు మాత్రం బీజేపీ వెంట పడుతున్నారు. వివిధ మార్గాల ద్వారా బీజేపీ అగ్ర నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మోడీ గ్రాఫ్ దేశవ్యాప్తంగా తగ్గిపోతున్న తరుణంలో, బిజెపికి వ్యతిరేకంగా టిడిపి జాతీయ స్థాయిలో ఉద్యమిస్తే, టిడిపి రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా ఉండదు. బిజెపి వ్యతిరేకత పార్టీలన్నీ చంద్రబాబుకు జత కలిసే అవకాశం ఉంటుంది. అలాగే ఏపీలో ఆ పార్టీకి మంచి ఊపు వస్తుంది. ఇవన్నీ పట్టించుకోకుండా బీజేపీ గ్రాఫ్ దేశవ్యాప్తంగా తగ్గుతున్నా, ఆ పార్టీ వెంటే చంద్రబాబు పడుతూ రొటీన్ గా రాజకీయాలు నడిపిస్తున్నారు. టీడీపీకి మంచి ఊపు తీసుకువచ్చే అవకాశం కళ్ళముందు కనిపిస్తున్న పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తూ , పాత తరహా రాజకీయాలనే చంద్రబాబు నమ్ముకుంటున్నారు అనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు.
-Surya